27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి ..

Must read

📰 Generate e-Paper Clip

డీఈవో అశోక్

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కోటగల్లీ లో గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో అశోక్ హాజరై మాట్లాడారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను  అభినందించారు.  ప్రతి పాఠశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సుమారుగా 40 మంది  రక్తదానం చేశారు.  మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల విద్యశాఖ అధికారి సాయిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు,సభ్యులు తోట రాజశేఖర్,రవి స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్,ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article