27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మేకలు చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న గ్రామస్తులు

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : మేకలను చోరీ చేసి విక్రయిస్తున్న వ్యక్తిని  మాక్లూర్ మండలం చిక్లి గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని మేకల మంద వద్ద మేకలు ఎత్తుకెళ్లే ప్రయత్నంలో  గ్రామస్తుడు గంగన్న  చూసి అరవడంతో బైక్, మేక వదిలేసి  పారిపోయాడు. మరో బండిని చోరీ చేసి అల్వాపూర్ గ్రామంలోని మేకలు ఎత్తుకెళ్లి సమయంలో వల్లభాపూర్ గ్రామ శివారులో చిక్లీ గ్రామస్తులకు అతడు చిక్కాడు. దీంతో అతడిని విచారించగా   నందిపేట్ లోని నాగపంచ కాలనీకి చెందిన టేకు ప్రశాంత్ అని తెలిపాడని పేర్కొన్నారు. గత నాలుగేళ్ల నుంచి గొర్రె, మేకలను చోరీ చేసి నవీపేట్ లో తనతో సంబంధం ఉన్న మటన్ వ్యాపారస్తులకు అమ్ముతున్నాడని తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని మాక్లూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.

More articles

Latest article