27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు, జరిమానా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ డివిజన్ లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి మంగళవారం స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహన్ బేగం ఐదుగురికి జైలు శిక్ష, 26మందికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..  నిజామాబాద్ డివిజన్ పరిధిలో అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన 31మందిని పట్టుకున్నారు. వీరికి సంబంధిత పోలీస్ స్టేషన్లలలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వీరిని స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహన్ బేగం ముందు హాజరు పరిచారు. వీరిలో 5గురికి జైలు శిక్ష, 26మందికి జరిమానా విధించారు.

More articles

Latest article