27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మట్కారాయుళ్లకు రెండు రోజుల జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరానికి చెందిన ఇద్దరు మట్కారాయుళ్లకు న్యాయస్థానం రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రఘుపతి గురువారం తెలిపారు. నగరంలోని కోజా కాలనీలో సయ్యద్ అబ్దుల్ సమద్, అబ్దుల్ రెహ మాన్ మట్కా ఆడుతుండగా ఈనెల 8వ తేదీన అరెస్టు చేశామన్నారు. ఇరువురిని న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి ఇద్దరికి రూ.500, రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు. మట్కా, జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని రఘుపతి స్పష్టం చేశారు.

More articles

Latest article