నారాయణపూర్, బతుకమ్మ : ఛత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం రావడంతో భద్రతాబలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
