- 26 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 22 మంది ఎఎస్ఐల బదిలీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా కానిస్టేబుళ్లను ట్రాన్స్ ఫర్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 116 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ మంగళవారం సీపీ సాయిచైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఐదేళ్లుగా ఒకే చోట ఉన్న వారికి స్థానచలనం కల్పించారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాయిచైతన్య తన మార్కు చూపిస్తున్నారు. అధికారులు, సిబ్బంది పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన అవినీతి ఆరోపణల నేపథ్యంలోముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. 4 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన 26 మంది హెడ్ కానిస్టేబుళ్లను,3 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన 22 మంది ఎఎస్ఐలను బదిలి చేశారు.


