27.5 C
Hyderabad
Friday, July 31, 2026

కావేరి మృతికి కారకులను కఠినంగా శిక్షించండి

Must read

📰 Generate e-Paper Clip

  • మీర్ పేట్ పోలీసులతో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన మేధారి రాజేశ్వర్ కూతురు కావేరి శనివారం హైదరాబాద్ లో ఆత్మహత్య చేసికొని మృతి చెందింది. గత మూడు నెలల క్రితమే వివాహమైన కావేరి ఆత్మహత్య విషయాన్నీ స్థానిక బీయర్ఎస్ నాయకులు రేగుల్ల రాములు, పిట్ల సత్యం లు మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం శుభకార్యాలకు హాజరయేందుకు వచ్చిన ఎమ్మెల్యే వేముల వెంటనే స్పంధించి కావేరి మృతికి కారుకులైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మీర్ పేట్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడారు.మృతురాలు తన సొంత గ్రామానికి చెందిన ఆడబిడ్డ అని వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్సై కి ప్రశాంత్ రెడ్డి సూచించారు. కావేరి ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం వేల్పూర్ మండల కేంద్రంలో విషాదాచాయాలు అలుముకొన్నాయి.

More articles

Latest article