నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ పరీక్ష కు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 14 నుండి హాల్ టికెట్ల పంపిణీ చేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్ కుమార్ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్ రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్ మరియు బ్యాక్ లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్ ల కు) ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16 నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 14 తేది నుండి సంబంధిత కళాశాలలో హాల్ టికెట్లు పొందవచ్చునని తెలిపారు.
