25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ:రుద్రూర్ మండల కేంద్రంతో పాటు రాణంపల్లి గ్రామంలో శనివారం పాడి పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని మండల పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ అన్నారు. పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. ఇందులో 190 పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  పశువైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article