27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మెండోరా పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సిపి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ శుక్రవారం సి పి  సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెల్ఫేర్ గురించి, రికార్డ్స్ నిర్వహణ గురించి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మెండోరా మండల పరిధిలో గల గ్రామాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగినది. ముఖ్యంగా మెండోరా మండలంలో గల క్రైమ్ గురించి కూడా తెలుసుకోవడం జరిగినది అలాగే మండల ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి వుండి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెచ్చే విధంగా పోలీసులు క్రమశిక్షణతో ఉండాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడాలని ఫిర్యాదుదారులకు పోలీస్ వారు తగినంత సహాయం చేయాలని ఈ ప్రాంతం రైతులతో కూడిన కాబట్టి రైతులకు ఏదైనా ఇబ్బందులు కలిగిన మీ లెవల్లో అధికారులకు మాట్లాడి పరిష్కరించగలరని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడే రోజులలో రైతులకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు రైతులు తీసుకునే విధంగా ఎప్పటికప్పుడు వర్ష సూచన కూడా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

More articles

Latest article