25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

దళిత రత్న అవార్డుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల దళిత నాయకులకు వారు చేసిన విశిష్ట సేవలను గుర్తించి దళితరత్న అవార్డులను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్నిరాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరి గారి ప్రీతమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో దళితుల పట్ల చేస్తున్న సేవ అంకిత భావాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య కు దళితరత్న అవార్డు ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేతుల మీదుగా దళిత రత్న అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భం జీవితంలో మరువలేని చాలా సంతోషమైన జ్ఞాపకం అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతమ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Distribution of Dalit Ratna Awards

More articles

Latest article