24.7 C
Hyderabad
Monday, August 3, 2026

 సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు

Must read

📰 Generate e-Paper Clip

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో

అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు

హైదరాబాద్, బతుకమ్మ : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు చేశారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.  బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలని, అత్యవసర ఔషధాలను సిద్ధం చేసుకోవాలన్నారు.  ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో  అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి మనం ఉన్నామనే సందేశం ఇవ్వాలని సూచించారు.

More articles

Latest article