29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నేటి యువత  సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్, బతుకమ్మ : అల్లూరి సీతారామరాజును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నగరంలోని కోటగల్లిలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూల మాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అల్లూరిది ఒక ప్రతేక అధ్యాయమన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటాలకు గుర్తుగా 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article