వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసి లోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. శివానంద మృతి యోగ రంగానికి తీరనిలోటు అన్నారు.

