29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతర  పోరాటం చేస్తామని సీపీఎం నగర కార్యదర్శి సుజాత అన్నారు. గురువారం మే డేని పురస్కరించుకొని నాగారం గోశాల వద్ద  సుజాత జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చిందన్నారు. దీంతో  షాపింగ్ మాల్, ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్  కార్మికులుగా పని చేస్తున్న వారు శ్రమదోపిడీ గురువతున్నారన్నారు. కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకురాకుండా భవిష్యత్తులో ఉధృతంగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు.   ఈ కార్యక్రమంలో   శ్రీదేవి,  రేఖ, లలిత, జమున, జ్యోతి,  మాధవి, సత్యశీల, లక్ష్మి, సునీత, ఫిరంగి భాయ్, శాలుబాయ్,  రాణి, రేఖ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article