నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీజీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం నగరలోని మెడికల్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, కార్యదర్శి సంగం అమృత్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సర్వ మెడికల్ కళాశాలలకు సాధారణ బదిలీలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన మెడికల్ కళాశాలల్లో తక్షణమే నియామక ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో జూనియర్ డాక్టర్లు పని చేస్తున్నా, సీనియర్ డాక్టర్లు జిల్లాల, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తుండటం అన్యాయం అని పేర్కొన్నారు. సీనియర్లను పట్టించుకోకపోవడం అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యానికి తగిన శాసనం అవసరమని

అభిప్రాయపడారు. మునుపటి కాలంలో పదోన్నతుల కోసం సేవలకు ఆధారంగా వెయిటేజి పాయింట్లు ఇచ్చేవారు, ప్రస్తుతం ఆ విధానం నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇది అమలులో ఉంది. అందుకని మరల వెయిటేజి పాయింట్ల విధానాన్ని పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ బకాయిలు ఇంకా విడుదల కాలేదు. వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనాభా పెరుగుదల, జీవన ఖర్చు పెరిగిన దృష్ట్యా హెచ్ఆర్ఏ శాతం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జలగం తిరుపతి రావు, అసోసియేట్ అధ్యక్షుడు దేవిసింగ్, టీజీఓ ఖజాంచి ఎన్. రాములు, ఉపాధ్యక్షుడు డా. నాగమోహన్, సంయుక్త కార్యదర్శి డా. డండు స్వామి , అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జగదీశ్ , అర్బన్ యూనిట్ కార్యదర్శినాగరాజు పాల్గొన్నారు.

