సూర్యాపేట జిల్లాలో ఘటన
మునగాల, బతుకమ్మ : తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ ను బైక్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేసేందుకు వెళ్లిన కూతరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు గ్రామానికి చెందిన యశస్విని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేస్తోంది. తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేయాలనుకొని యశస్విని, తోటి ఉద్యోగితో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్ పై బయలుదేరింది. ఈక్రమంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల జరిగిన రోడ్డు ప్రమాదంలో యశస్విని మృతి చెందింది.
