27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మొట్టమొదటి పేగు మార్పిడి ఆపరేషన్ విజయవంతం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలోనే మొదటిసారి పేగు మార్పిడి ఆపరేషన్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో విజయవంతమైంది. టీపీఎన్ మద్దతుతో షార్ట్ గట్ సిండ్రోమ్, పదేపదే సెంట్రల్ లైన్ ఇన్ఫెక్షన్లు, మేజర్ సెంట్రల్ వెయిన్స్ థ్రాంబోసిస్ తో బాధపడుతూ 40 ఏళ్ల వ్యక్తి ఉస్మానియాకు వచ్చాడు.

గ్యాంగ్రీన్ కోసం అతడు చిన్న పేగు, కుడి పెద్దపేగు విచ్ఛేదనం చేయించుకున్నాడు. అతడికి ఈనెల 19వ తేదీన కాడవర్ చిన్న పేగు మార్పిడీ చేశామని, ప్రస్తుతం అతడు నోటి ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తున్నాడని ఉస్మానియా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బయాప్సీలో ఎటువంటి సమస్య కనిపించడం లేదని అన్నారు.

More articles

Latest article