బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : గత 30 రోజులుగా బీడీ కార్మికులకు పని ఇవ్వకుండా వేధిస్తున్న రామ్ స్వరూప్ బీడీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని, తక్షణం పని కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి లేబర్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వేర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఎటువంటి సమాచారం లేకుండా గత 30 రోజులుగా పని కల్పించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న రామ్ స్వరూప్ యాజమాన్యంపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులకు నెలకు 20 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు బాకీ ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని దారం నాణ్యమైన తునికాకు ఇవ్వాలని అన్నారు లేని పక్షంలో కార్మికులు చేసే పోరాటానికి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి కిషన్ టీయూసీఐ జిల్లా నాయకులు మురళి, కార్మికులు లక్ష్మీ, సుజాత, జమున,రాధా, శకుంతల, జమున,మహేష్, విటల్,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

