రామ్ స్వరూప్ బీడీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : గత 30 రోజులుగా బీడీ కార్మికులకు పని ఇవ్వకుండా వేధిస్తున్న రామ్ స్వరూప్ బీడీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని, తక్షణం పని కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి లేబర్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వేర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఎటువంటి సమాచారం లేకుండా...