30.9 C
Hyderabad
Monday, August 3, 2026

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : అర్హత కలిగిన కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.  బుధవారం లింగం పేట్ మండల కేంద్రం లోని బిసి కాలనీ కి చెందిన ఇబ్రహీం మమత రేకులషెడ్ ను కలెక్టర్ పరిశీలించారు. తాను కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాను అని, తన భర్త మరణించాడని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనీ కలెక్టర్ ను కోరారు. ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్ ను తొలగించి, అదే స్థలంలో ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఇతర సిబ్బంది ఉన్నారు.

Indiramma houses should be granted only to those who are deserving.

More articles

Latest article