- విద్యార్థులను అభినందించిన చైర్మన్ చిలవేరి సురేష్ బాబు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్ పరీక్ష ఫలితాలలో సత్య ఒకేషనర్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల చైర్మన్ చిలవేరి సురేష్ బాబు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వరుసగా కంప్యూటర్ సైన్స్ లో పి.విశాల్ 482/5000, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ నందు ఇ.రోజా నాగభూషన్ 481/500, ఎంపిహెచ్డబ్ల్యూ కోర్సు నందు ఎ.కీర్తన 480/500 మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ నందు షిఫా ఫాతిమా 472/5000 మార్కులతో రాష్ట్ర ర్యాంకులతో ముందున్నారని తెలిపారు. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ నందు ఎం.శ్రద్ధా 963/1000, మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ నందు నష్రా అంజూమ్ 960/1000, ఎలక్ట్రిషియన్ నందు కె.శ్రీచరణ్ 935/1000, ఎంపిహెచ్డబ్ల్యూ కోర్సు నందు ఎం.కీర్తన 926/1000 రాష్ట్ర ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల రాష్ట్ర ర్యాంకులు సాధించడంలో ఎప్పుడూ ముందుంటుందని, ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ర్యాంకులు సాధించిందని తెలిపారు. సత్య ఒకేషనల్ ప్రిన్సిపల్ జి.సురేష్ మాట్లాడుతూ సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రతి సంవత్సరం మా రికార్డులను మేమే బ్రేక్ చేసుకుంటున్నామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ చిలవేరి మురళీ క్రుష్ణ, కో ఆర్డినేటర్లు కె.సునీల్, బి.కళ్యాణ్, జి.క్రిష్ణ, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
