28.8 C
Hyderabad
Monday, August 3, 2026

వరి కొనుగోలు కేంద్రం తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

రామారెడ్డి, బతుకమ్మ : రామారెడ్డి మండలంలోని కన్నాపురం గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఎసీఎస్ఓ, డీసీ(సీఎస్) శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కురిసిన గాలివాన, అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు తడిసి పోవడంతో సమీపంలోని భాగ్యలక్ష్మీ రైస్ మిల్ కు తరలించారు. వర్షం వచ్చినప్పుడు వరి కుప్పలను టర్పాలిన్ తో కప్పాలని సూచించారు. ధాన్యం త్వరగా కాంట చేసి మిల్లలకు పంపాలని సెంటర్ ఇంచార్జీ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్, మనిటరింగ్ ఆఫీసర్, సొసైటీ సీఈఓ, రైతులు పాల్గొన్నారు.

Rice purchasing center inspection

More articles

Latest article