27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజాం సాగర్ లోకి భారీగా ఇన్ ఫ్లో

Must read

📰 Generate e-Paper Clip

Heavy inflow into Nizam Sagar

 

. మత్తడి దుంకుతున్న సింగీతం

బతుకమ్మ, కామారెడ్డి: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులోకి 12,300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ప్రస్తుతం 5.022 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు.

పొంగిపొర్లుతున్న సింగీతం

సింగీతం రిజర్వాయర్ మత్తడి దుంకుతున్నది. రిజర్వాయర్ నీటిమట్టం 416.550 మీటర్లు కాగా ఎగువ ఉన్న  అటవి ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా 5వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. 4వేల క్యూసెక్కుల మేర నీరు మత్తడి దుంకుతున్నది. నీటి పారుదల శాఖాధికారులు  వెయ్యి క్యూసెక్కుల నీటిని నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి వదిలారు. సింగితం రిజర్వాయర్ మత్తడి పోస్తుండగా ఆ ప్రాంతాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటి పారుధల శాఖాధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Heavy inflow into Nizam Sagar

 

More articles

Latest article