బతుకమ్మ, భిక్కనూరు : వరంగల్ ఎల్కతుర్తి లో ఈనెల 25న టిఆర్ఎస్ పార్టీ నిర్వహించే రజతోత్సవ మహాసభ కార్యక్రమ వాల్ పోస్టర్లను భిక్కనూరులో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ మేరకు టిఆర్ఎస్ నాయకులు మహేందర్ రెడ్డి, భూం రెడ్డి, అత్తెల్లి శ్రీనివాస్, యాదగిరి మాట్లాడుతూ ఎలుకతుర్తిలో నిర్వహించే పార్టీ రాయితోత్సవ కార్యక్రమానికి భిక్కనూరు మండలం నుండి వేల సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు మేధావులు, పార్టీ అభిమానులను తరలించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
