కమ్మరపల్లి, బతుకమ్మ : మండలంలోని ఉప్పులూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలను మండల పశువైద్యాధికారి రాజశేఖర్ రావు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాడి రైతు తమ పశువులకు తప్పకుండా టీకా వేయించుకోవాలని సూచించారు. జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడితే పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు,పశు వైద్య సిబ్బంది, గోపాలమిత్ర, తదితరులు పాల్గొన్నారు.
