నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఈనెల 12న ఓ వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన అనుమానితుని కోసం గాలిస్తున్నట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 12న నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి కు చెందిన కుంచెపు బాబు అనే వ్యక్తి నిజామాబాదు రైల్వేస్టేషన్ లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉండగా గుర్తు తెలియని వ్యక్తి అతనితో గొడవపడ్డాడు. అంతేకాకుండా బ్లెడ్ సాయంతో బాబు మెడపై గాయపర్చాడు. బాబు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈవిషయమై ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రైల్వే పోలీస్ నిజామాబాదు కు పంపారు. రైల్వే పోలీసులు కూడా అతడిపై కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ ఇంత వరకు దొరకలేదు. బాబు పై దాడి చేసిన వ్యక్తి యొక్క ఫోటోలను విడుదల చేశారు. అతడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే ఈనంబర్ కు 8712658591 సమాచారం ఇవ్వాలని ఎస్సై సాయిరెడ్డి కోరారు.
