26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా మాజీ ఎమ్మెల్యే బిగాల జన్మదిన  వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు సిర్ప రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్లో, స్నేహ సొసైటీలో  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దావఖానలో రోగులకు గాండ్ల లింగం, నర్సింగరావు, సుదం రవిచందర్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. యువజన విభాగం ఆధ్వర్యంలో డీలోడ్  ఆకాష్. ఆధ్వర్యంలో 25 కిలోల రైస్ బ్యాగ్ తో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, దండు శేఖర్ , మాజీ నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్,దాత్రిక పరమేష్,కరిపే రాజు, గాండ్ల లింగం తదితరులు పాల్గొన్నారు.

Former MLA Bigala's birthday celebrated in grand style

More articles

Latest article