24 C
Hyderabad
Sunday, August 2, 2026

బుస్సాపూర్ ఉపాధ్యాయుల బడిబాట

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గురువారం బడిబాట నిర్వహించారు. బుస్సాపూర్ గ్రామ ప్రజలు పోచంపాడు సమీపం లో ఉపాధి పనులు నిర్వహిస్తున్న సందర్భంగా ఉపాధ్యాయులు అక్కడికి వెళ్లి ప్రభుత్వ బడిలోకి విద్యార్థులను పంపించాలని బడిబాట నిర్వహించారు. అదేవిధంగా మెండోరా ప్రత్యేక అధికారి ఆంజనేయులు విచ్చేసి ఉపాధి కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ బడులో పిల్లల్ని చేర్పించడం వల్ల నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పించిందని  పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కూలీలకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, శమంత, ఉపాధ్యాయులు ఓ రమేష్, శారద, బుస్సాపూర్ జీ. పీ సెక్రెటరీ భోజేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article