25.3 C
Hyderabad

లోకల్ క్యాండిడేట్ అంతా మాయ

Must read

📰 Generate e-Paper Clip

  • లోకల్ సర్టిఫికెట్ జారీలో ఆపరేటర్లదే పై చేయి?

 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు ఎమ్మార్వో కార్యాలయంలో లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అంత మాయ గానే కనిపిస్తుంది. ఎమ్మార్వో  కార్యాలయంలో వేరే వేరే రాష్ట్రాలకు చెందిన వారికి లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారని విశ్వనీయ సమాచారం. దింతో లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తో ఇతర రాష్ట్రాల వారికి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, కార్డులు రేషన్ కార్డులు జారీ అవుతున్నాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో రాష్ట్రాల నుండి వచ్చిన వారికి రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయని, అన్ని అర్హతలు ఉన్న మాకు ఎందుకు జారీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  లోకల్ సర్టిఫికెట్  జారీలో కంప్యూటర్ ఆపరేటర్  చేతివాటం ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article