26.6 C
Hyderabad
Monday, August 3, 2026

భాకర్ ఫారంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : హెగ్డోలి గ్రామపంచాయతీ పరిధిలోని భాకర్ పారం గ్రామంలో సోమవారం సిసి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. బాకర్ ఫారం గ్రామస్తులు గత 20 రోజుల క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవడం జరిగింది. గ్రామ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో పనులు చేపట్టేందుకు ఆయన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల నిధులను మంజూరు చేశారు. గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. తమ  గ్రామంలో గతంలో అభివృద్ధి కోసం ఎన్నో నిధులు మంజూరు చేశారని, బాకర్ ఫారం గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని గ్రామస్తులు కొనియాడారు. తమ గ్రామంలో మరెన్నో సమస్యలు నెలకొని ఉన్నాయని గ్రామస్తులు పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మిగిలిపోయిన పనులకు నిధులను మంజూరు చేసి తమ నూతన గ్రామపంచాయతీ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వినోద్ బాబు, సుంకరి దత్తు, ఆవుల సుబ్బారావు, ఇనుకుర్తి ఉదయ్, తులసి రామ్, సాయిలు, రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, సాంబయ్య, వల్లభనేని రాజేష్, ఉత్తం, జాస్తి రాజారావు, ప్రభాకర్ రావు, తలసిల రమేష్, అచ్యుతరావు, పూర్ణచంద్రరావు, దశరథ్, మున్నంగి రామకృష్ణ, డోంగ్లి హన్మద్లు, వనాలే దత్తు, వీరేశం, కనకమెడల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article