- ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు నాంపల్లి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చాలామంది డా.బీ.ఆర్.అంబేద్కర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తున్నారని ఆయన అందరివాడని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నాంపల్లి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న వారినందరిని సర్వే చేయగా అంబేద్కర్ను జ్ఞానవంతునిగా గుర్తించే కొలంబియా యూనివర్సిటీ ముఖ ద్వారం ద్వారా వారి విగ్రహాన్ని పెట్టారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి కూడా అంబేద్కర్ ని గుర్తించే వారి జయంతులను జరుపుకుంటున్నారని తెలిపారు. కానీ కొంతమంది అంబేద్కర్ అందరూ వాడు కాదని ప్రచారం చేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
