నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్, కారర్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు గైని గంగారాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం సతీశ్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, చిట్టి నారాయణరెడ్డి, జిల్లా కోశాధికారి దినేశ్ బాబు, సంయుక్త కార్యదర్శులు జాఫర్ హుస్సేన్, పార్థసారథి, అర్బన్ యూనిట్ అధ్యక్షకార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, ఎస్సారెస్పీ యూనిట్ అధ్యక్షులు ప్రవీన్ రాజ్, సర్వే యూనిట్ జిల్లా కార్యదర్శి సతీశ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాశ్, గురు చరణ్, స్వామి, ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
