27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రామాలయంలో మొక్కులు తీర్చుకున్న ఇంచార్జ్ అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి లో జిల్లాలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చందర్ నాయక్ శ్రీసీతారామస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ,  గ్రామస్తులు శాలువాతో సత్కరించారు. వివరాల్లోకెళ్తే కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బాదవ చందర్ నాయక్ తన స్వగ్రామమైన ఇందల్వాయి తండాలో జన్మించి ఉన్నత విద్య చదివి తన యొక్క స్వగ్రామం రామాలయం దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, సభ్యులు, వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article