29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ సలహా కమిటీలో జిల్లావాసి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో జక్రాన్పల్లి మండలం కలిగోట్ కు చెందిన కొట్టాల సత్యం నారాగౌడ్ సభ్యునిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కష్టాలను తగ్గించడానికి, గల్ఫ్ దేశాలైన (బెహరాన్, కువైట్, ఇరాక్, ఓమన్, ఖత్తర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెడ్స్)లలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కార్మికుల సమస్యలను అధ్యయనం చేయ డానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కలిగోట్కు చెందిన కొట్టాల సత్యం నారాగౌడ్ దుబాయ్లో స్థిరపడ్డాడు. రెండు సంవత్సరాల పదవీకాలంతో ఈ కమిటీ పనిచేయనుంది. చైర్మన్ గా వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా మంద బిన్ రేడ్డీ,సభ్యులుగా ఆది శ్రీనివాస్ వేవ లవాడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో పాటు అ నీల్కుమార్, సింగిరెడ్డి నరేష్రెడ్డి, లీజీ జోసఫ్, చెన్నమనేని శ్రీనివాస్రావు, గూగిళ్ల రవీందర్, నంగిదేవేందర్, స్వదేశ్ పార్కీపాన్లలు సభ్యులుగా వ్యవహరించనున్నారు. తన నియామకానికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సత్యం నారాగౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

District resident on Gulf NRI Policy Advisory Committee

More articles

Latest article