25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కిడ్నాపైన బాలిక క్షేమo

Must read

📰 Generate e-Paper Clip

  • ఇద్దరు కిడ్నాపర్లను అరెస్టు చేసిన పోలీసులు

     

  • నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో ఈ నెల మొదటి వారంలో మిస్సింగ్ అయిన బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో గురువారం ఆయన వివరాలను వెల్లడించారు.  బాలికని ఎత్తుకు వెళ్ళిన వ్యక్తిని మహా రాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ఉమ్రీ మీదుగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీర్జాపూర్ కు తీసుకెళ్లినట్టు గుర్తించారు. మద్నూర్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ నిజామాబాద్ లో ఉంటుంన్నాడు. నీరు పార్టీ ప్రాంతం నుంచి మూడు సంవత్సరాల రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్ గ్రామంలో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిజామాబాద్ నగరంలో 120 సీసీ కెమెరాలు ఓటేజీలను
  • The girl who was kidnapped is safe.
  • పరిశీలించారు. రైలులో బాలిక మహారాష్ట్రకు తరలించినట్లు గుర్తించి చాకచక్యంగా మద్నూర్లో బాలికను గుర్తించి తల్లికి అప్పగించినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి తెలిపారు.  గత నెలలో ఒకటవటౌన్ పరిధిలో రైల్వే స్టేషన్ నుంచి మిస్సయిన బాలుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగారం చెందిన రమ్య కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలికను తల్లిదండ్రులకు చెంతకు చేరీనట్టు తెలిసింది.. గతంలో మిస్సింగ్… కిడ్నాప్ కేసులు మహారాష్ట  లో చేదించిన ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని కేసును నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో ఛేదించినందుకు వారిని అభినందించారు.
  • The girl who was kidnapped is safe.

More articles

Latest article