27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ట్రీమ్స్ లో విద్యార్థిని చితకబాదిన ఇన్చార్జి ప్రిన్సిపాల్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :నిజామాబాద్ నగరం లోని ట్రీమ్స్ స్కూల్ బాయ్స్ (నాగరం) లో 9వ తరగతి చదువుతున్న ఐమాన్ ఖాన్ అనే విద్యార్థిని ఇన్చార్జి ప్రిన్సిపల్ తుకారం కర్రతో చితకబాదాడు. ఈ ఘటనలో బాలుడి వీపుపై వాతలు వచ్చేలా దెబ్బలు తగలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.  విద్యార్థి  ఐమాన్ ఖాన్ తండ్రి అఫ్రోజ్ ఖాన్ మజిలీస్ నాయకులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఫయాజుద్దీన్ సాహబ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ షాబాజ్, మాజీ కార్పొరేటర్లు మహ్మద్ రియాజ్ అహ్మద్, అబ్దుల్ అలీ, అబ్దుల్ సలీం, మీర్జా అఫ్సర్ బేగ్ లు  పాఠశాలకు వెళ్లి అధికారులను నిలదీశారు. ఇంఛార్జ్ అర్షి ఇక్బాల్ ,మొహమ్మద్ బషీర్, ట్రీమ్స్ బాయ్స్ ప్రిన్సిపాల్  కిరణ్ గౌడ్  విషయాలను వెల్లడించారని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ తుకారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  నిరసన తర్వాత జిల్లా  ట్రీమ్స్ ఆర్ ఎల్ సీ  అర్షి ఇక్బాల్, మహ్మద్ బషీర్ ఆలీ ,స్కూల్ ప్రిన్సిపాల్ కిరణ్ గౌడ్ వెంటనే చర్య తీసుకుని తుక్కారామ్‌ను ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ పదవి నుండి తొలగించి, నగర ట్రీమ్స్ బాయ్స్ పాఠశాల నుండి తుక్కారామ్‌ను తప్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత అధికారులకు నివేదిక పంపారు. అయ్మాన్ ఖాన్  ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐమాన్ ఖాన్ తండ్రి అఫ్రోజ్ ఖాన్ సకాలంలో చేరుకుని మద్దతు అందించినందుకు  మజిలీస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Principal in charge assaults student in Treams

More articles

Latest article