నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో ఈ నెల మొదటి వారంలో కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీని పోలీసులు గుర్తించారు. బాలిక ని ఎత్తుకెళ్లిన వ్యక్తిని మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత నెలలో ఒకటవటౌన్ పరిధిలో రైల్వే స్టేషన్ నుంచి మిస్సయిన బాలుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగారం చెందిన రమ్య (3) కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలికను తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్టు తెలిసింది.. గతంలో కిడ్నాప్ కేసులను పోలీసులు మహారాష్ట్ర లో ఛేదించడం గమనార్హం.
