బాన్సువాడ, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ముల్తాని, మహమ్మద్ ఇక్రమ్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అత్కూరి మహేష్, తిగుళ్ల రాజా వరప్రసాద్, బురిగెడి సాయిలు, షేక్ ఇలియాస్, షామీర్ ఖురేషి, అఫ్రోజ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
