30.9 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కంటి చూపు పోయిన విద్యార్థి కి న్యాయం చేయాలి
  • భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్

బతుకమ్మ, తాడ్వాయి: తాడ్వాయి మండలం నందివాడ ప్రభుత్వ పాఠశాలలో కృష్ణాష్టమి జయంతి సందర్భంగా ఉట్టి కార్యక్రమంలో జరిగిన సంఘటనలో జిల్లా విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవీయం విఠల్ డిమాండ్ చేశారు. నందివాడ ఉన్నత పాఠశాలలో 6 తరగతి చదువుతున్న శరత్ అనే విద్యార్థికి గత వారం కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టబోయి కట్టే వచ్చి అతని కంటిలోకి వెల్లిందన్నారు. దీంతో అతని కంటి చూపు పోవడం వల్ల అతనిని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తరలించారని తెలిపారు. ఉన్నత అధికారుల నిర్లక్ష్యం ఉందని స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.ఈ విషయం జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిసి కూడా చర్యలు తీసుకోకుండా వారికే సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాలలో ఉపాద్యాయులు సమయపాలన పాటించడం లేదని అన్నారు. వారికి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సపోర్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి విషయాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్య తీసుకోవాలని కలెక్టర్ను కోరుతున్నామన్నారు.

Action should be taken against the negligence of District Education Officer

More articles

Latest article