28.2 C
Hyderabad

బస్సులు ఆపడం లేదని డీఎంకు ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూర్, బతుకమ్మ : భిక్కనూరు మండల కేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని హైమద్ బీఈడీ కాలేజీ విద్యార్థులు బస్సులు ఆపడం లేదని డీఎం కు ఫోన్ లో ఫిర్యాదు చేశారు.

ఫ్రీ బస్సు పథకం ఉచితంగా అమలులోకి వచ్చినా కండక్టర్లు, డ్రైవర్లు మాత్రం బూతులు ఆపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూర్ బస్టాండ్ లో లేదంటే అంతంపల్లి బస్టాండ్ లో దిగాలని కండక్టర్లు హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపేది లేదని, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోవాలని కండక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకొని బస్సులు ఆపాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.

More articles

Latest article