భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన బీయర్ఎస్ నాయకులు, మాజీ సొసైటీ డైరెక్టర్ శ్రీధర్ గౌడ్, నాయకులు చిన్న కిష్టాగౌడ్, జనార్దన్ గౌడ్ లింగగౌడ్, నగేష్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వీరికి పార్టీ ఖండ్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ సీ. ఎం రేవంత్ రెడ్డి చేస్తున్న జనాకర్షణ పనులకు ఆకర్షతులమై కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రెసిడెంట్ బోదిరే స్వామి, మండల నాయకులు కోరాడి రాజు, పర్స అనంత్ రావు, గ్రామ శాఖ ప్రెసిడెంట్ బూరెడ్డి సంతోష్, కోరాడి లింబాద్రి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
