28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అక్రమ నియామకాలను రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అర్హులకు ఉద్యోగాలను ఇవ్వాలి లేకపోతే ఆందోళన తప్పదు
  • టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కామారెడ్డి మ్యాన్ పవర్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసి లక్షల రూపాయలు వసూలు చేసి అనర్హులకు ఉద్యోగాలకు ఎంపిక చేసిందని వాటిని వెంటనే రద్దు చేయకపోతే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు, జహీరాబాద్ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ఇంచార్జ్ బోండ్ల అంజల్ రెడ్డి లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు,బోండ్ల అంజల్ రెడ్డి లు మాట్లాడుతూ నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో దరఖాస్తు చేసుకుంటే అవినీతి సొమ్ముకు ఆశపడిన మెడికల్ కళాశాల ఉద్యోగులు కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్వాహకులు లక్షల రూపాయలు వసూలు చేసి రోస్టర్ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారం నియామకాలను చేయడం జరిగిందని, ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు సైతం వెబ్ సైట్ లో అందుబాటులో ఉండగా అలాంటిది అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నియామకం చేసిన వారి యొక్క వివరాలు ఇప్పటివరకు బయటకు రావడం లేదంటే ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేది అర్థం చేసుకోవచ్చని అన్నారు.  టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా 50 మందికి మెడికల్ కళాశాలలో ఉద్యోగాలను కల్పిస్తే ఒక్కొక్కరి నుండి లక్షలాది రూపాయలను వసూలు చేసి అక్రమ నియామకాలను చేయడం జరిగిందని అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించారని వెంటనే నియామకాలను రద్దు చేయకపోతే నిరుద్యోగులతో కలిసి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కామారెడ్డి యువత ఈ అవినీతిని ప్రశ్నించాలని మాకెందుకులే,మాకు సంబంధం లేదని అనుకుంటే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు మరింతగా పెరుగుతాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ఆందోళన కార్యక్రమాలకు ముందుకు రావాలని అన్నారు.కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ నియామకాల పైన సమగ్ర విచారణ జరిపి దీనికి కారకులైన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

 

Illegal appointments should be cancelled.

More articles

Latest article