25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో దయనీయంగా రైతుల పరిస్థితి

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  ధ్వజమెత్తారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్ లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చేసిన హామీలు ఎక్కడిపోయాయని ప్రశ్నించారు. పంటలకు నీరు లేక రైతులు కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం సుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందించలేదని, ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు కంట నీరు పెడతున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలు, కరెంట్ కొరత కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఇందూరు జిల్లా అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు,రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,ఈ మండల నాయకులు, కిసాన్ మోర్చా రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ మోర్చాల జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

The situation of farmers in the state is miserable.

More articles

Latest article