25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్సెస్సీ విద్యార్థులకు బస్సు సౌకర్యం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ కథనానికి స్పందించిన అధికారులు
బాన్సువాడ, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన 78 మంది ఎస్సెస్సీ విద్యార్థులను ఆరు కిలోమీటర్ల దూరంలోని పరీక్షాకేంద్రానికి డీసీఎంలో తరలిస్తున్న వైనాన్ని ఎత్తి చూపుతూ ‘ప్రమాదకరంగా పరీక్షా కేంద్రానికి గురుకుల విద్యార్థుల తరలింపు’ శీర్షికన ‘బతుకమ్మ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులను సెంటర్ కు తరలిస్తున్నారు.

Bus facility for SSC students

More articles

Latest article