25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

చికిత్స పొందుతు వడ్డి వ్యాపారి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో విశ్వనాథం (58) బుదవారంహైద్రబాద్ లోని ఓక ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. విశ్వనాథం అనే వడ్డీ వ్యాపారిపై రెండు రోజుల క్రితం కాలనీలోని శివాలయం వద్ద కారులో వచ్చి కర్రలు, మరణాయుధాలతో నలుగురు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. దేవునిపల్లి కి చెందిన మహిళతో విశ్వనాథం కు ఆర్థిక లావాదేవీలు భూతగాదాలు ఉన్నాయి. ఇటీవల సధరు మహిళ తాను తీసుకున్న డబ్బులు వడ్డితో సహ చెల్లించినా తనను వేదిస్తున్నారని తనకు చావే శరణ్యం అని సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ ఐన విషయం విదితమే. వడ్డి వ్యాపారి విశ్వనాధంపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి న్యాయం చేయాని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్న కామారెడ్డి పట్టణ పోలీసులు.

More articles

Latest article