24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ -320 డి వారి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థిని, విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లయన్ లంక రవి, బోధన్ కెనరా బ్యాంకు మేనేజర్ సునీల్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. లయన్స్  క్లబ్ వారు చేస్తున్న సేవలను కొనియారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ప్రెసిడెంట్ కే.వి. మోహన్, పాఠశాల హెడ్మాస్టర్ రామ్ సింగ్, లైన్స్ క్లబ్ ప్రతినిధులు శ్యామ్ సుందర్ పహడే, పుట్టి సాగర్, ప్రశాంత్ గౌడ్, షామీర్, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article