వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను బుధవారం ప్రవేశపెట్టనుంది. ఈనేపథ్యంలో జరిగే బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు కానున్నారు. గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఈసారి గవర్నర్ ప్రసంగం రోజున కేసీఆర్ సభకు వచ్చారు. బడ్జెట్ ప్రసంగంతో పాటు చర్చలకు కూడా కేసీఆర్ దూరంగా ఉండనున్నారు.
