బతుకమ్మ బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రముఖ స్టీల్ వాణిజ్య సంస్థ నిర్వాహకులు మాశెట్టి నర్సయ్య చేసిన సేవ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని సర్.సి.వి రామన్ అకాడమీ (సేవా సాంస్కృతిక సంస్థ) ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో వాసవి సేవ వ్యాపార వైభవ రత్న బిరుదు తో పాటు బహుమతిని ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ గత 55 సంవత్సరాలుగా నేను వాణిజ్య సంస్థను నడుపుతూ లయన్స్ క్లబ్, వాసవి క్లబ్, అయ్యప్ప సేవా సమితి, శివాలయ కమిటీ తదితర వాటిలలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, గతంలో కూడా నంది అవార్డు తదితర అవార్డులు ప్రశంసాపత్రాలు అందుకోవడం జరిగిందని అందులో భాగంగా నేడు సర్.సి.వి రామన్ అకాడమీ తరఫున ఈ బిరుదును, బహుమతిని, ప్రశంసాపత్రాన్ని అందుకోవడం ఎంతో ఆనందదాయకమని, నన్ను ఎంపిక చేయడం పట్ల సర్.సి.వి రామన్ అకాడమీ సంస్థ నిర్వాహకులకు, ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సహకరించిన నా బంధుమిత్ర సహోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు.

