24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలిచింది

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, రుద్రూర్:  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన చివరికి న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ మేరాజ్, గాండ్ల మధు అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బుధవారం పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మేరాజ్, మధు మాట్లాడుతూ..  ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, కల్వకుంట్ల కవితపై మోపిన అభియోగాలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ అబ్దుల్ మతీన్, షేక్ ముజీబ్, నీరడి సాయిలు, కొండల్వాడి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article